సాధారణంగా సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన నటుడి గురించి తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఒక హీరో గురించి రాసిన కథ మరొక హీరో దగ్గరికి వెళ్లడం అనంతరం ఆయన ఆ సినిమాలో నటించడం మనం చూస్తూనే ఉంటాం. ఇక వేరే హీరో దగ్గరికి వెళ్లిన ఆ కథ హిట్ కావచ్చు లేదా ఫ్లాప్ కూడా కావచ్చు. సాధారణంగా ఒక హీరో గురించి ఒక కథ అనుకున్నప్పుడు ఆ సినిమాలో నటించే హీరో తనకు నచ్చిన కొన్ని మార్పులను చేయమని అంటూ ఉంటారు. దీనికిగాను ఆదర్శకుడికి హీరో చెప్పిన మార్పులు నచ్చితే కథలో కొన్ని మార్పులను చేస్తారు.

 ఒకవేళ నచ్చకపోతే వేరే హీరోతో ఆ సినిమాని చేస్తారు. అయితే తాజాగా అలానే రవితేజ దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది ఒక సినిమా కథ. ఇక ఆ సినిమానే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జై లవకుశ. అయితే ఈ సినిమా కథను మొదటగా  హీరో రవితేజకు వినిపించడం జరిగింది. ఇక ఈ సినిమాలో మూడు పాత్రలు ఉండడంతో రవితేజ కూడా ఈ కథను చాలా ఆసక్తిగా విన్నారు. కథ మొత్తం విన్న అనంతరం జై పాత్ర మినహా రెండు పాత్రలను చేయడం బావుందని జై పాత్ర పొటెన్షియాలిటీని తగ్గించి మిగిలిన రెండు పాత్రల ప్రాధాన్యతను పెంచమని బాబీకి చెప్పాడు రవితేజ.

అనంతరం బాబీకి ఆ మార్పులను చేయమని చెప్పడంతో బాబి దీనికి అంగీకరించలేదు. దాని అనంతరం ఈ కథను ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లి ఎన్టీఆర్ కి వినిపించాడు బాబి.  కథ విన్న అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి ఓకే చెప్పాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా ఏంతటి విజయాన్ని ఎందుకునో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. దీంతో ఈ వార్త విన్న చాలా మంది మాస్ మహారాజ రవితేజ అభిమానులు రవితేజసినిమా చేసి ఉంటే బాగుండేది తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేసుకునేవాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: