అయినా కూడా ఇన్నాళ్లు అక్కడే సినిమా లు చేయాలని జాన్వీ కపూర్ కూడా భావించింది. ఎట్టకేలకు ఆమె తీరు లో అయితే మార్పు వచ్చింది. వరుసగా సినిమాలు చేయాలి అనుకున్న జాన్వీ కపూర్ కు అక్కడ ఆశించిన స్థాయిలో సినిమా ల్లో అవకాశాలు రావడం లేదు. దాంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు జాన్వీ కపూర్ కు కోటి రూపాయలకు పైగా పారితోషికం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధంగా వున్నారని తెలుస్తుంది.. కానీ ఇప్పుడు తెలుగు లో ఆమె నటించబోతున్న సినిమాకు కోటి లోపు పారితోషికం అందుకుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్ లు పడటంతో తెలుగు లో కూడా ఈ అమ్మడి క్రేజ్ కూడా తగ్గిందని.. అందుకే తక్కువ పారితోషికం ఇస్తున్నట్లుగా సమాచారం.
ఎన్టీఆర్ 30 లో జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యింది. ఆమె కు 80 లక్షల రూపాయల పారితోషికంతో పాటు పది లక్షల రూపాయల ఇతర అలవెన్స్ లు స్టాఫ్ ఖర్చులు ఇస్తున్నారని సమాచారం.. అంటే కోటికి లోపే జాన్వీ కపూర్ పారితోషకం వున్నది.ఎన్టీఆర్ 30 సినిమా లో ఆమె నటించి విజయం అందుకుంటే అప్పుడు మళ్లీ కోటిన్నర వరకు ఈమె పారితోషికం డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. తెలుగు లో ఈమెకు మంచి డిమాండ్ ఉన్న సమయంలో అయితే నటించలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడం వల్ల తెలుగు సినిమా లకు ఆమె ఓకే చెబుతుంది అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ముందు ముందు అయినా ఇక్కడ వరుస సినిమాలు చేస్తుందో లేదో చూడాలి మరి..