ఇదిలా ఉండగా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో మిల్క్ బ్యూటీ తమన్నా.. నటుడు విజయ్ వర్మ లా పేర్లు మార్మోగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా గోవాకు వెళ్లిన తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కాదు పబ్లిక్ గానే వీరిద్దరూ ముద్దాడుకున్నారని ఒక వీడియో కూడా వైరల్ అయింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన పాత ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే నటుడు విజయ్ వర్మ విషయానికి వస్తే.. బాలీవుడ్లో నటుడిగా సెటిల్ అయినప్పటికీ హైదరాబాదుకి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇక్కడే థియేటర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ కోర్సులో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అలా 2008లో షోర్ అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్ లో అడుగుపెట్టి.. 2012లో చిట్టగాడ్ మూవీతో బాలీవుడ్ ప్రవేశం చేశారు. 2016లో పింక్ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన గల్లీబాయ్, సూపర్ 30, భాగి 3, డార్లింగ్స్ వంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.