తాజాగా  తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మరియు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వరిసు అనే సినిమా తెరకెక్కనుంది. ఇక తెలుగులో ఈ సినిమా వారసుడు అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందినట్లుగా.. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ ఇటీవల వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.. అందులో భాగంగానే రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు శ్రీకాంత్. వారసుడు సినిమాలో విజయ్ కి సోదరుడిగా అలరించునున్నాడు.ఇందులో భాగంగానే రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సి15 సినిమా గురించి మాట్లాడుతూ

 డైరెక్టర్ తో పని చేయడం చాలా కొత్తగా ఉంది.. మొదటిసారి ఈయన దర్శకత్వంలో నేను నటిస్తున్నాను.. నన్ను ఎప్పుడూ చూడని విధంగా ఒక కొత్త యాంగిల్ లో ఈ సినిమాలో నన్ను చూస్తారు.. ఎన్నడూ చూడని విధంగా సరికొత్త అనుభూతిని శంకర్ సినిమా షూటింగ్లో నేను చూశాను.. ఆయనతో కలిసి పనిచేయడం నాకు చాలా కొత్తగా ఉంది.. ఈ సినిమాలో నా రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఆర్సి15 సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతుందని ఇందులో రాంచరణ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కేర్ ఆధ్వర్యంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: