స్వయంకృషితో తనకంటూ స్టార్ హీరో గుర్తింపును పొందాడు మెగాస్టార్ చిరంజీవి. తన సినిమాలతో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు సినిమాలలో నటిస్తూ భారీ క్రేజ్ ను అందుకున్న చిరంజీవి సేవ గుణంతో దేశవ్యాప్తంగా తానేంటో రుజువు చేసుకున్నాడు.తన దగ్గర ఉన్న దాంట్లో తన వంతు సహాయం చేస్తూ ఎంతో మందిని ఆదుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందికి సహాయాన్ని అందించాడు.తన సేవాగుణంతో మరింత పాపులారిటీని మెగాస్టార్ చిరంజీవి పొందాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన ప్రజలు మరియు అభిమానుల కోసమే ఈ స్థాయిలో ఆలోచించే చిరంజీవి తన కుటుంబం కోసం ఆలోచించకుండా ఉంటాడా..? 

ముఖ్యంగా తన కూతుళ్ళ విషయంలో ముందస్తు జాగ్రత్తతో ఉంటాడు చిరంజీవి. తాను సంపాదించిన ఆస్తిలో తన ఇంటి ఆడబిడ్డలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలని భావిస్తాడు మెగాస్టార్. అయితే ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి భార్య సలహాతో తన చెల్లెలకి కోట్ల రూపాయల భూములను బహుమతిగా ఇచ్చాడు చిరంజీవి. అయితే ఇప్పుడు తన కూతురు కోసం ఏకంగా 35 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లాను బహుమతిగా తన కూతురికి ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  తాను నటించిన సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో హైదరాబాదులోని ఎమ్మెల్యే కాలనీలో తన చిన్న కూతురు శ్రీజ కోసం ఏకంగా 35 కోట్లు ఖర్చు చేసి ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

అనంతరం ఆ బంగ్లాను తన చిన్న కూతురు శ్రీజ కి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. దీంతో చాలామంది ఎందుకు ఇంత ఖరీదైన బంగ్లా నూతన చిన్న కూతురుకి చిరంజీవి ఇవ్వాలనుకున్నాడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీజకు ఇంత ఖరీదైన బంగ్లాను చిరంజీవి బహుమతిగా ఇవ్వడానికి కారణం... శ్రీజ మొదట బ్రాహ్మణ వ్యక్తిని వివాహం చేసుకుంది.. దాని అనంతరం ఒక కూతురికి కూడా జన్మనిచ్చింది. తర్వాత ఆయనతో విడాకులు తీసుకుంది.. ఇటీవల రెండవ వివాహం చేసుకున్నప్పటికీ భర్త కళ్యాణ్ దేవ్ కి కూడా దూరంగా ఉంటుంది శ్రీజ. వీరిద్దరికి కూడా మరొక బిడ్డ ఉంది. అయితే చిరంజీవి ఈ ఇద్దరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ ఇద్దరి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిరంజీవి ఈ నిర్ణయం తీసుకొని 35 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లాను శ్రీజ కి బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: