హీరోయిన్లు సహజంగా ఉంటే వారిని బాగా లైక్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు బాగా మేకప్ తో కనిపిస్తే మాత్రం బాగా ట్రోల్ చేసేస్తారు.

అయితే సహజంగా ఉన్న హీరోయిన్లు మరింత అందంగా కనిపించడానికి కొన్ని సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇటువంటి సర్జరీలు ఫ్యాన్స్ అయితే అస్సలు ఇష్టపడరు. సర్జరీ చేయించుకోవడం వల్ల ఉన్న అందం కోల్పోతారన్న భయంతో వారికి సర్జరీ చేయించుకోవద్దు అంటూ సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. తాజాగా అటువంటి సలహానే న్యాచురల్ బ్యూటీ అయిన శ్రీ లీలకు తమ అభిమాని ఇచ్చారట.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అదరగొడుతున్న బ్యూటీ శ్రీ లీల. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి విజయాలతో లతో బాగా దూసుకెళ్తుంది. మొదటి సారిగా 2019లో ముద్దు అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిందని సమాచారం.. ఇక అదే సంవత్సరం భరతే అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. దీంతో కన్నడలో తనకు మంచి గుర్తింపు అయితే వచ్చింది.

2021 లో పెళ్లి సందD సినిమాతో ప్రేక్షకులకు ఆమె పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తన డాన్స్ తో బాగా అదరగొట్టింది. అలా తెలుగు ప్రేక్షకులతో మంచి అనుబంధం పెంచుకుంది. ఇక  రవితేజ నటించిన ధమాకా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీ లీల క్రేజ్  కూడా బాగా పెరిగిపోయింది. ఓవర్ నైట్ స్టార్ గా అయితే మారిపోయింది. ఆ సమయంలోనే ఆమె కన్నడలో కూడా రెండు సినిమాలను చేసింది.దీంతో ధమాకా ఎఫెక్ట్ తో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతల కన్ను పడింది.. అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలను ఓకే చేశారు. ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు సమాచారం..

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గానే కనిపిస్తుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను మరియు సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది. ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు కూడా తెగ ఫిదా అవుతూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టా గ్రామ్ లో రెండు ఫోటోలను పంచుకుంది.

అయితే అందులో ఈ బ్యూటీ ఫేస్ లో ఒక మార్పు బాగా కనిపించింది. అదేంటంటే తన పై పెదవి పై కాస్త చిన్న మార్పు బాగా కనిపించింది. వెంటనే అది గమనించిన కొందరు పెదాలకు ఏమయ్యింది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓ నెటిజన్  నీ అందమైన పెదాలను ఎవరు పాడు చేశారు.. నువ్వు అప్పటికే మంచి పర్ఫెక్ట్ మరియు అందమైన అమ్మాయివి. దయచేసి ఎటువంటి సర్జరీలు చేసుకొని మమ్మల్ని బాధ పెట్టొద్దంటూ కూడా సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ కామెంట్ తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: