దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట బేషరమ్ పాట ద్వారా వివాదాల్లో నిలిచింది ఈ చిత్రం . ఇందుకు కారణం ఈ పాటలో దీపికా పదుకొనే కాషాయపు కుంకుమ రంగు బికినీ ధరించడమే ఇందుకు కారణం. ఇండియన్ సినిమాలలో బికినీ ధరించడం.. అలాగే హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఇలాంటి రంగు దుస్తులు ధరించడం ఏంటి అంటూ కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంతమంది దర్శకులు చెప్పినట్టుగానే దీపిక ధరించింది ఇందులో తన తప్పేమీ లేదు అన్నట్టుగా కూడా ఆమె వైపు నిలిచారు.
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఆమె వివాదాల్లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాషాయపు రంగు చీర కట్టిన దీపికా పదుకొనే చూడడానికి చాలా అందంగా కనిపించింది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే కాషాయపు కుంకుమ రంగు చెప్పులు కూడా ధరించడం వివాదాలకు దారితీస్తోంది. హిందూ సంప్రదాయాన్ని గౌరవించాలి కానీ అలాంటి పవిత్రమైన కాషాయపు కుంకుమ రంగు ఉన్న చెప్పులను ధరించడం ఏంటి? అంటూ కూడా ఆమెపై ఫైర్ అవుతున్నారు . మరి ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.