సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది నరేష్ మరియు పవిత్ర నే. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో తెగ మారుమొగుతున్నాయి. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా వీరిద్దరి రిలేషన్షిప్ కి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ అందులో లిప్ లాక్ చేసుకుంటూ మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం.. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎప్పటినుండో వీరిద్దరిపై వస్తున్న వార్తలకు ఈ ఒక్క వీడియోతో అందరి నోరులను ముయించారు పవిత్ర లోకేష్.

 గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం నడుస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు రావడం జరిగింది. వారందరికీ గట్టి సమాధానం ఇస్తూ మేమిద్దరం పెళ్లికి రెడీ అయ్యాము అన్నట్లు వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఈ క్రమంలోని మహేష్ బాబు కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరూ వివాహం చేసుకోవడంలో మహేష్ బాబు కి ఎలాంటి అభ్యంతరం లేదని.. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను మహేష్ బాబు దగ్గర ఉండి చర్చిస్తున్నారని..

నరేష్ మూడవ భార్య రమ్యతో విడాకుల అనంతరం పవిత్రతో నరేష్ పెళ్లికి మహేష్ బాబు కి ఎలాంటి అభ్యంతరం లేదు అని.. మహేష్ బాబు చెప్పినట్లుగా సమాచారం. ఇక తాజాగా కృష్ణ గారు మరణించడంతో ఆయన ఫ్యామిలీ బాధ్యతలను మహేష్ బాబు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకుగాను మహేష్ బాబు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చేయనట్లుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ వార్త విన్న చాలా మంది మహేష్ బాబు అనుకుంటే నరేష్ పెళ్లి కచ్చితంగా అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ మహేష్ బాబుకి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: