బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆమె అందం, నటనతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది ఈమె. విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమాలో నటించిన ఈమె అప్పటినుండి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. అయితే తెలుగులో ఈమె చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల ఆమె ప్రేమించిన విక్కి కౌశలను రాజస్థాన్లోని సవాయి మాదాపూర్ జిల్లా బార్వారా లోని 700 సంవత్సరాల నాటి సిక్స్ సెన్సెస్ పోర్ట్ లో రాజరిక పద్ధతిలో వివాహం చేసుకుంది కత్రినా. 

ఎన్నో ఏళ్ల పాటు ఈమె వివాహం కోసం బాలీవుడ్ తో పాటు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. ఎవరు ఊహించిన విధంగా విక్కీ కౌశల్ ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. ఈమె పెళ్లి అయిన తర్వాత నుండి ఎంతో అన్యోన్యంగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. అంతేకాదు ముఖ్యంగా బాలీవుడ్లో క్యూట్ కపుల్ గా కూడా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం ఈమె ఆస్తుల కి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కత్రినా సంపాదన విషయంలో తన భర్త కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తుందని తెలుస్తోంది.

 ప్రస్తుతం కత్రినా ఒక్క సినిమాకి గాను దాదాపు 11 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటుంది. సంవత్సరానికి ఈమె 23 కోట్ల వరకు సంపాదిస్తుంది. సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్లకి ఎండార్మెంట్ కోసం దాదాపు ఏడు కోట్ల రూపాయలను తీసుకుంటుంది. వీటితోపాటు కత్రినా దగ్గర కొన్ని ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో లగ్జరీ భవనాలు, ప్లాట్లు ,అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అయితే సుమారు కత్రినా దగ్గర 300 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కత్రినాతో పాటు ఆమె భర్త కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన ఒక సినిమాకి గాను ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఆయన భర్త కి సుమారు 30 కోట్లకు పైనే ఆస్తి ఉందని తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: