2014లో వచ్చిన సతురంగ వెట్టై సినిమా సీక్వెల్ ఇది. 2016 లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రొడక్షన్ విషయంలో వివాదాలు రావడం వల్ల సినిమా నిలిచిపోయింది . ఆ తర్వాత 2016 అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో కూడా కొన్ని కారణాలు వల్ల సినిమా విడుదలకు నోచుకోలేదు. తిరిగి 2017 మార్చ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు.
అయితే ఎట్టకేలకు 2022లో రిలీజ్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఆ ప్రయత్నం కూడా విఫలం అయింది. కానీ ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది. 2023 ఫిబ్రవరిలో సతురంగ వెట్టై 2 సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ సంవత్సరమైన సినిమా రిలీజ్ అవుతుందా? లేక వాయిదా పడుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమిళ్ భాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, డేనియల్ బాలాజీ, నాజర్, సుకుమారన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఏడాది విడుదలకు నోచుకుంటుందా ?ఒకవేళ విడుదలయితే ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది? త్రిష క్రేజ్ ను మరింత పెంచుతుందా? అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.