2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2016లో ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ 2017లో మిస్టర్ , అంధగాడు, ఏంజెల్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది . అంతేకాదు అదే ఏడాది విన్నై తాండి వంద ఏంజెల్ అనే తమిళ చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హెబ్బా పటేల్ 2018లో 24 కిస్సెస్ సినిమాలో నటించినా.. ఆ తర్వాత 2020లో ఒరే బుజ్జిగా చిత్రంలో నటించినది.
అవకాశాలు లేక దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హెబ్బా పటేల్ 2022లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి అందరిని అలరించింది. మొదట్లో గ్లామరస్ పాత్రలతో బోల్డుగా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇలా ఈ చిత్రంలో డి గ్లామరస్ పాత్ర పోషించేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ సినిమాలో ఈమె నటనకు ఈమెకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు కాబట్టి తన కెరీర్లో మునుముందు ఇలాంటి మంచి అవకాశాలు ఎన్నో అందుకోవాలని హెరాల్డ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.