సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా చాలాకాలం పాటు ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ఇక సినీ ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటుతున్న ఇప్పటికీ తన తరగని అందం, అభినయంతో యంగ్ హీరోయిన్స్ కి దీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ రోజురోజుకీ తనలో అందం మరింత ఎక్కువవుతుంది. ఈ వయసులో కూడా తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేస్తోంది. ఇక ఈమె గ్లామర్ పక్కన యంగ్ హీరోయిన్లు సైతం తేలిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇక 'నీ మనసు నాకు తెలుసు' అని సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరయిన్ గా ఆరంగేట్రం చేసింది త్రిష.
ఆ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన వర్షం సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకొని అగ్ర హీరోల సినిమాలో నటించి భారీ క్రేజ్ దక్కించుకుంది. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది త్రిష. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించి స్టార్ డంను కైవసం చేసుకుంది. ఇక తాజాగా మణిరత్నం దర్శకత్వంలో పోనియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె అందాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇదిలా ఉంటే త్రిషకి మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అంటే చాలా ఇష్టమట. అప్పట్లో త్రిష వెంకటేష్ సరసన నటించి బెస్ట్ జోడిగా పేరు తెచ్చుకుంది.
టాలీవుడ్ లో మొట్టమొదటగా వెంకటేష్ తో సౌందర్య వరుస సినిమాలు చేసి బెస్ట్ జోడి అనిపించుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలో సిమ్రాన్ వచ్చి చేరింది. సిమ్రాన్, వెంకీల జోడి కూడా అప్పట్లో చాలా ఫేమస్. మళ్లీ ఆ తర్వాత త్రిష వెంకటేష్ తో నటించి బెస్ట్ జోడిగా పేరు తెచ్చుకుంది.వీరిద్దరి కాంబినేషన్లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశ అనే సినిమాలు వచ్చాయి. అయితే త్రిష మరోసారి వెంకటేష్ తో నటించే అవకాశం వస్తే బాగుంటుందని ఎదురు చూస్తోందట. ఎందుకంటే తనకు వెంకటేష్ అంటే చాలా ఇష్టం అని అంటుంది. అందుకే ఇప్పుడు మరోసారి ఆయనతో నటించేందుకు ఆసక్తి చూపుతోంది త్రిష. మరి మళ్లీ వెంకటేష్ తో నటించే అవకాశం త్రిషకి ఏ డైరెక్టర్ ఇస్తాడో చూడాలి..!!