బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ 'ప్రాజెక్టు కే' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించి భారీ క్రేజ్ ను అందుకున్న దీపికా పదుకొనే ఇప్పుడు ప్రభాస్ కోసం తన కెరీర్లో మునుపెన్నడు చేయని ఓ పని చేయబోతుందట. ఇంతకీ ఆ పని ఏమిటంటే.. నార్త్ లో ఇప్పటికే దీపిక పదుకొనేకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి చేరుకోవడంతో ఇక్కడ కూడా సినిమాలు చేయడానికి బాలీవుడ్ హీరోయిన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపికా పదుకొనే ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తోంది.

అయితే ఈ సినిమా కోసం దీపిక పదుకొనే ఇప్పటివరకు బాలీవుడ్ లో కూడా చేయని ఓ పని చేస్తుందట. ఇప్పటివరకు తాను బాలీవుడ్ లో నటించిన సినిమాలకి సంబంధించిన ఏ ఒక్క డైలాగ్ ని కూడా దీపిక ప్రాక్టీస్ చేసింది లేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ తో సీన్ అంటే ఒకటికి నాలుగు సార్లు ఆ సీన్ కు సంబంధించిన డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేస్తోందట. అంతేకాదు ఆ డైలాగ్స్ సరిగ్గా వచ్చాకే షూటింగ్ లోకేషన్ కి వెళ్తుందట. అయితే దీపిక లో ఈ మార్పు చూసి అందరూ షాక్ అవుతున్నారట. దీపికా పదుకొనే ఇప్పటివరకు ఏ సినిమా కోసం రిహార్సల్స్ చేయలేదని.. ఇక ప్రభాస్ సినిమా అనేసరికి ఇలా డైలాగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందని, డార్లింగ్ నటన చూసి అతని డెడికేషన్ చూసి ముచ్చటపడిన దీపిక..

ప్రభాస్ ని మ్యాచ్ చేయడం కోసం ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ కె కోసం దీపిక చాలా కష్టపడుతోంది. ఇక ఈ సినిమా కనుక హిట్ అయితే దీపికా పదుకొనే కు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక తాజాగా ప్రాజెక్టుకే నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా సోషల్ మీడియా వేదికగా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: