గత కొంతకాలం నుంచి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఏకంగా న్యూ ఇయర్ కి ఇద్దరు కూడా మాల్దీవ్స్ కు వెళ్లి ఎంజాయ్ చేశారు అంటూ కొన్ని ఫోటోలు ఏకంగా ఇంటర్నెట్ ను షేర్ చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాల్లో నటించారు.. అయితే ఇందులో గీతాగోవిందం హిట్ కాగా డియర్ కామ్రేడ్ అంచనాలను అందుకోలేకపోయింది.


 ఇదిలా ఉంటే ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఇందుకు కారణం వీరు నటించిన రెండు సినిమాల్లో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడమే. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమే అని ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఎంతలా క్లారిటీ ఇచ్చినప్పటికీ అభిమానులు మాత్రం వీరు రిలేషన్షిప్ లో ఉన్నారు అన్న విషయాన్ని ఫిక్స్ అయిపోయారు. న్యూ ఇయర్ కి ఇద్దరు కూడా మాల్దీవ్స్ కు వెళ్లి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడంతో స్నేహితులు కానే కాదు ప్రేమికులు మాత్రమే అంటూ రూమర్స్ మళ్లీ జోరందుకున్నాయి.



 అయితే తమ అభిమాన హీరో హీరోయిన్లు ఎవరైనా ప్రేమలో ఉన్నారు అని తెలిస్తే చాలు వారి గురించి ఏ విషయం బయటకు వచ్చిన తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అంతేకాదు ఇక ఇటీవల కాలంలో ఇలా సినీ సెలబ్రిటీలు ప్రేమలో ఉంటే వారికి ఒక నిక్ నేమ్ పెట్టడం ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రణవీర్ సింగ్, దీపిక పదుకొనే జంటకు దీప్ వీర్ అని.. అనుష్క కోహ్లీ జంటకు విరుష్క అని ఎన్నో నిక్సిమ్స్ పెట్టగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక జంటకు కూడా 'virash' అని ఒక నిక్ నేమ్ పెట్టారట అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: