ఇక ఈ ఎపిసోడ్ కి బాహుబలి ఎపిసోడ్ అనే పేరు పెట్టి ఇక రెండు పార్ట్ లుగా ఆహా టీం విడుదల చేసింది. మొదటి భాగం న్యూ ఇయర్ కు రెండు రోజుల ముందే రాగా ఇందులో ప్రభాస్ మాత్రమే కనిపించాడు. ఇక రెండవ భాగంలో మాత్రం గోపీచంద్ ప్రభాస్ మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. ప్రభాస్, గోపీచంద్ దగ్గర నుంచి బాలయ్య ఎన్నో ఆసక్తికర విషయాలను రాబట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అలవాటులో పొరపాటుగా గోపీచంద్ ఏకంగా ప్రభాస్ సీక్రెట్ ని బయటపెట్టేసాడు.
ప్రభాస్ సిగరెట్ ఎక్కువగా తాగుతాడు అన్న విషయాన్ని గోపీచంద్ రివిల్ చేశాడు. మీరూ ఇద్దరూ చిరాకుగా ఉంటే ఏం చేస్తారు అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. ప్రభాస్ మాట్లాడుతూ గోపీచంద్ కి అసలు చిరాకు కోపం రావని ఓపిక చాలా ఎక్కువ అని ఎప్పుడు కూల్ గా మాట్లాడుతూ ఉంటాడని సమాధానం చెప్పాడు. అనంతరం గోపీచంద్ ప్రభాస్ గురించి చెబుతూ.. ఒకవేళ ప్రభాస్ కి కోపం చిరాకు వస్తే అందరిని అక్కడి నుంచి వెళ్లిపోమంటాడు.. పక్కన ఎవరిని ఉండొద్దని చెబుతూ ఉంటాడు. ఇక తర్వాత ఒక్కడే వెళ్లి కూర్చొని సిగరెట్ తాగుతాడు అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. అయితే సిగరెట్ తాగుతాడు అనే విషయం డైరెక్ట్ గా చెప్పకుండా ఇక చేతులతో సింబాలిక్ గా చెప్పాడు. ఇలా ఏకంగా ప్రభాస్ వీక్నెస్ ను బయటపెట్టేశాడు అతని స్నేహితుడు గోపీచంద్.