
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్ తో సినిమాలు తీయాలని ఎందరో ప్రముఖ దర్శకులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ దృష్టి మాత్రం మణిరత్నం పై ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ‘ఆహా’ లో స్ట్రీమ్ అవుతున్న ‘అన్ ష్టాపబుల్’ షోకు అతిధిగా వచ్చిన ప్రభాస్ తనకు భవిష్యత్ లో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పాడు.
అంతేకాదు తనకు బాపు దర్శకత్వంలో శ్రీరాముని పాత్ర చేయాలని ఉందని అయితే అది జరగదని తనకు తెలుసు అంటూ మణిరత్నం పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీనితో మణిరత్నం ఈ సంకేతాలు అందుకుని సరైన కథతో ప్రభాస్ వద్దకు వస్తే ప్రభాస్ మణిరత్నం ల మూవీ ఖాయం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతానికి ప్రభాస్ తన సినిమాలతో చాల బిజీగా ఉన్నాడు. మణిరత్నం కూడ తన ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 ను పూర్తి చేసే హడావిడిలో ఉన్నాడు. దీనితో ప్రబాస్ మణిరత్నం ల మూవీ రావాలి అంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఈలోపున ప్రభాస్ అభిప్రాయాలు మారిపోతే ఇంకా చాల సమయం పట్టినా ఆశ్చర్యంలేదు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడు ఒక క్రేజీ మూవీ ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పడం ప్రస్తుతానికి చాల కష్టం..