తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది శ్రీ లీల. ధమాకా సినిమా సక్సెస్ తో వరుస సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఆమె నటన మరియు డాన్స్ తో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది శ్రీ లీల. అయితే తాజాగా త్రివిక్రమ్ మరియు సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని అనుకున్నారు. దాని అనంతరం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. 

ఇందులో భాగంగానే ఇద్దరు హీరోయిన్లు ఉంటే బాగుంటుంది అని సెకండ్ హీరోయిన్ కోసం దర్శకుడు సంయుక్త మీనన్ మరియు అను ఇమ్మానుయేల్ వంటి హీరోయిన్లతో సైతం చర్చలు జరిపాడు. చాలామందిని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అనుకున్నప్పటికీ ఆఖరికి శ్రీ లీల లని ఫిక్స్ చేసినట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ  సినిమాలో శ్రీ లీల కూడా తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా

 విజయంతో ఫుల్ ఫామ్ లో ఉంది శ్రీ లీల. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం రామ్ పోతినేని మరియు నితిన్ తో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీ లీల. ఇక ఈ స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కారణంగా మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు అని భావించిన శ్రీ లీల ఈ సినిమా నుండి తప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకుగాను మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీలా చేసేందుకు త్రివిక్రమ్ సైతం ఆమెని ఒప్పించ లేకపోయాడు అని తెలుస్తోంది.దీంతో శ్రీ లీలా ఈ సినిమాలో నుండి తప్పుకోవడంతో త్రివిక్రమ్  ఇప్పుడు మరోసారి ఈ సినిమాలోని సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: