గత 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలో  చేస్తూ దూసుకుపోతున్న తమన్నా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు విజయ్ వర్మతో తమన్న ప్రేమన లో ఉంది అని రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా కొత్త సంవత్సరాన్ని ఇద్దరూ గోవాలో జరుపుకుంటున్నట్టు కొన్ని ఫోటోలను కూడా తమ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

దాంతో తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది అని చాలామంది భావిస్తున్నారు. అయితే ఎన్ని రకాల వార్తలు వస్తున్నప్పటికీ తమన్నా గాని అటు విజయ్ వర్మ గాని ఈ వార్తలపై ఇప్పటికీ కూడా స్పందించలేదు. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వస్తున్నప్పటికీ వీరిద్దరూ ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమన్న మొట్టమొదటిసారి ఓ మలయాళ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మళయాల హిట్ ఫిలిం రామ్ లీలా సినిమా

 వచ్చిన అనంతరం హీరో దిలీప్ మరియు దర్శకుడు అరుణ్ గోపి కాంబినేషన్లో ఇప్పుడు మరోసారి ఓ సినిమా రానుంది. బాంద్రా అని టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది అని తెలుస్తుంది. ఇక తన కెరియర్ లోనే మొదటిసారి మలయాళ సినిమాలో నటిస్తుండడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా కొచ్చి లో జరిగిన ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇక తమన్నా ఈ సినిమాలో యువరాణి  పాత్రలో మలయాళం లోనే కాకుండా హిందీ భాషలో కూడా మాట్లాడుతుందని తెలుస్తుంది. అయితే తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కొచ్చితో పాటు ముంబై నేపథ్యంలో కూడా కొనసాగుతుందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: