టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ బరువు తగ్గే పనిలో పడ్డాడట. సినిమాలో పాత్రకు తగినట్లుగా మారిపోవడం తారక్ కి అలవాటే  అరవింద సమేత సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో మెరిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ కోసం మళ్లీ బరువు పెరిగాడు. అయితే త్రిబుల్ ఆర్ తర్వాత చాలా నెలపాటు అదే ఫిజిక్ ని మెయింటైన్ చేశారు ఎన్టీఆర్. ఈ మధ్యకాలంలో కొరటాల శివ కోసం మళ్ళీ తన మేకోవర్ ని పూర్తిగా మార్చేసి సన్నబడ్డాడు. కొరటాల శివ తో ఎన్టీఆర్ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతుంది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లనే లేదు. 

సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తిగా లేడని.. అందుకే కొరటాల స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నందునే సినిమా ఆలస్యం అవుతుందని వార్తలు వినిపించాయి. ఇక ప్రస్తుతం ఫ్యామిలీతో అమెరికా వెకేషన్ లో ఉన్నాడు తారక్. ఇక వెకేషన్ ముగించుకొని వెంటనే కొరటాల శివ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ తన బరువును తగ్గించే పనిలో నిమగ్నమయ్యాడు. కొరటాల శివ సినిమాలో కథ ప్రకారం హీరో బాగా ఫిట్ గా ఉండాలి. అలాగే అంతే సన్నగా కూడా కనబడాలి. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం అనిపిస్తోంది.

కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫైనల్ నేరేషన్లో ఎన్టీఆర్ సూచించిన చిన్న చిన్న మార్పులను చేయడంపై కొరటాల శివ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో పూర్తి స్క్రిప్ట్ రెడీ అవుతుందని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి చివరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ ప్రాజెక్టుని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయకగా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ కి ఆరంగేట్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ కొరటాల సినిమాకి జాన్వి కపూర్ నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జాన్వి అడిగినంత ఇవ్వడానికి అటు నిర్మాతలు సైతం సిద్ధమైనట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: