సాధారణంగా సినిమా హీరోలు ఏం మాట్లాడినా కూడా అది సోషల్ మీడియాలో ఫాస్ట్ గా పాకి పోతూ ఉంటుంది  అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి విజయాలు సాధించిన హీరోలు ఇక స్టార్ హీరోలో ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఏదైనా వ్యాఖ్యలు చేశారంటే చాలు ఇండస్ట్రీ మొత్తంలో అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు యువ హీరో అడవి శేషు.


 ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోలలో అడవి శేషుకి మంచి సక్సెస్ రేటు ఉంది అనే విషయం తెలిసిందే. అతనికి కథలపై ఉన్న అవగాహన దర్శకత్వం పై ఉన్న పట్టు ఇక యాక్టింగ్ లో ఉన్న టాలెంట్ కి వంక పెట్టడానికి అసలు వీల్లేదు. తన టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి తన కెరీర్ను తన చేజేతులారా బిల్డ్ చేసుకుంటున్నాడు అడవి శేషు. ఎలాంటి కథలు ఎంచుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకున్న శేష్ ఇక అలాంటి సినిమాలే  చేస్తూ వెళ్తున్నాడని చెప్పాలి. క్షణం చిత్రంతోమొదలైన శేష్ ప్రభంజనం ఇక ఇప్పుడు గూడచారి, ఎవరు, హిట్ 2 వరకు కూడా కొనసాగుతూనే ఉంది.


 ఇక సొంత టాలెంట్ తో ఎదిగిన శేషు కు ఇండస్ట్రీలో మంచి పేరు కూడా ఉంది. తన పని ఏంటో తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉంటాడని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల అడవి శేషు చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారిపోయాయి. ప్రస్తుతం తన సినిమాలకు తానే రచన అందించుకోవడం కారణంగానే వరుసగా హిట్లు కొట్టగలుగుతున్నాను అంటూ సొంత డబ్బా కొట్టుకున్న శేషు.. సినిమా స్టోరీలు ఎందుకు సిద్ధం చేసుకుంటున్నాను అన్న విషయాన్ని కూడా వివరణ ఇచ్చారు. తెలుగు సినిమాల్లో ఒక్కో ఫ్యామిలీకి పది మంది హీరోలు ఉన్నారు. వారందరినీ దాటుకుని మంచి కథలు బ్యాక్ గ్రౌండ్ లేని వారి వద్దకు రావాలంటే చాలా కష్టం.. అందుకే తన కథలను తానే రాసుకొని హిట్టు కొడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.  సొంత టాలెంట్ గురించి చెప్పుకోవడంలో తప్పులేదు కానీ రెండు హిట్లు పడగానే స్టార్ హీరో ఫ్యామిలీస్ మీద కామెంట్ చేయడం ఏంటి అంటూ కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: