ముఖ్యంగా శృంగార భరితమైన సినిమాలను తీస్తూ.. ఇక తన సినిమాలో హీరోయిన్లతో మితిమీరిన ఎక్స్పోజింగ్ చేయిస్తూ బూతు సినిమాలకు చిరునామాగా మారిపోయాడని చెప్పాలి.. అంతేకాదు ఇక వర్మ కొంతమంది లేడీ యాంకర్లతో చేసే ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వర్మ ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయారు అన్నది అందరిలో ఉన్న ప్రశ్న.
రాంగోపాల్ వర్మ కు హీరోయిన్ శ్రీదేవి అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. శ్రీదేవి పెళ్లి జరిగినప్పుడు కూడా వర్మ ఎంతగానో ఫీలయ్యారట. కాగా ఇటీవల మీ వల్లే నా జీవితం నాశనం అయిందంటూ వర్మ ఒక హీరోయిన్ పై కామెంట్స్ చేశారు. ఐటమ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న జయమాలిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వర్మ కి ఫోన్ చేశారట. దీంతో వర్మ మీ వల్లే నా చదువు పాడు చేసుకున్న అని చెప్పడంతో జయమాలిని షాక్ అయ్యారట. మీ డాన్స్ కి నేను పిచ్చి అభిమానిని. అందుకే చివరికి మీ పిచ్చితో చదువుకోకుండా సినిమాలు చూస్తూ ఉండిపోయేవాడిని అంటూ వర్మ సమాధానం చెప్పాడట.