ఆ తర్వాత భార్య పేరు మీద కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా సరైన సమయం లేక షూటింగ్లో పాల్గొనలేదు. కనీసం డిసెంబర్ 8 నుంచి అయినా షూటింగ్ ప్రారంభిస్తారు అనుకుంటే.. అప్పుడు కూడా వెకేషన్ కోసం అమెరికా వెళ్ళిపోయారు మహేష్ బాబు. ఇక ఎలాగో న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలను అక్కడే జరుపుకొని వచ్చిన వెంటనే జనవరి 6,7 తేదీలలో సినిమాను ప్రారంభిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగు సంక్రాంతి తర్వాత కూడా ప్రారంభం అయ్యేటట్టు కనిపించడం లేదు.
#SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా పూజ కార్యక్రమాలు అయితే పూర్తి చేశారు కానీ దాదాపు 8 నెలలకు పైగానే కావస్తున్నా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి షూటింగ్ అప్డేట్ రాకపోవడంతో నిజానికి ఈ సినిమా ఉందా? లేదా ? అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క మహేష్ బాబు ఈ సినిమాను ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత త్వరగా రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరి త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందా? ఒకవేళ లేకపోతే డైరెక్ట్ గా రాజమౌళితోనే మహేష్ బాబు సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.