శేఖర్ కమ్ముల అంటేనే ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏ సినిమా తెరకెక్కించిన నాచురాలిటీకి దగ్గరగా ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధం గా ఉంటుంది అని చెప్పాలి. ఇక అచ్చంగా ఇలాగే 2004లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక క్యాప్షన్ ఇచ్చినట్లుగానే ప్రేక్షకులను ఈ సినిమా ఆలరించింది అని చెప్పాలి.


 ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుకు దగ్గరైంది ఈ సినిమా. జీవితం లో ముఖ్యమైన ప్రేమ ఆత్మభిమానం తృప్తి లాంటి అంశాలను వెండితెరపై స్పష్టంగా చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక ఇందులో రాజా హీరోగా నటించగా కమలని ముఖర్జీ హీరోయిన్గా నటించింది. అయితే ఇక ఈ సినిమాతో కమలిని ముఖర్జీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తన అందం అభినయంతో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఆనంద్ సినిమా తర్వాత గోదావరి సినిమా తో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది కమలిని ముఖర్జీ.. ఇక తర్వాత హ్యాపీడేస్, పెళ్లయింది కానీ, జల్సా, గమ్యం, గోపి గోపిక గోదావరి లాంటి సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక చివరిగా మోహన్లాల్ నటించిన మన్యం పులిలో కనిపించిన కమలిని  అప్పటినుంచి ఏ సినిమాలో కూడా కనిపించ  లేదు.ప్రస్తుత ఆమె వయసు 42 ఏళ్ళు. ఇప్పటికి పెళ్లి చేసుకో లేదు అని చెప్పాలి.  ఈ అమ్మడు ఇప్పుడు ఏమై పోయింది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  అయితే తన సోదరులతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కమలని ముఖర్జీ ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టి అక్కడ సక్సెస్ అయిందట. ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వ్యాపారంగంలో బిజీగా మారి బాగానే సంపాదిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: