తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన కెరీర్ను మొదలుపెట్టిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈమె విలన్ గా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తుంది. ఇటీవల సమంత నటించిన యశోద సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్న ఈమె ఈ సంక్రాంతికి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహ రెడ్డి సినిమాలో కూడా మరొక కీలక పాత్రలో నటించి సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇక యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఎలాంటి పాత్రతో అలరిస్తుందో చూడాలి.

ఈ సినిమాలే కాకుండా  వీటితోపాటు ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈమె. అయితే ప్రస్తుతం వీర సింహారెడ్డి ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.ఇందులో భాగంగానే హీరోయిన్గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు విలన్ గా ఎందుకు నటిస్తుంది అన్న ప్రశ్న ఈమెకి ఎదురైంది.. దీనికి ఎవరు ఊహించని సమాధానాన్ని చెప్పింది ఈమె.. ఇందులో భాగంగానే వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ...

గ్లామర్ పాత్రలు అసలు నాకు వర్క్ అవుట్ అవ్వని గ్లామర్ రోల్స్ చేయలేక  ఇలా విలన్ గా  మారానని చెప్పుకొచ్చింది  వరలక్ష్మి శరత్ కుమార్.ఇక  సినీ ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్ లలో చేయడానికి చాలామంది హీరోయిన్లు ఉన్నారని.. కానీ కొందరు మాత్రమే విలన్ పాత్రలు చేయగలరు అని.. ఇక అలాంటి పాత్ర తానే చేయాలని వరలక్ష్మి చెప్పుకొచ్చింది.. అంతేకాదు ప్రతినాయకి పాత్రలో నటించినందుకు తనకి చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది  వరలక్ష్మి.ఇక వీర సింహారెడ్డి తో తన నట విశ్వరూపాన్ని ఏ విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ చూపిస్తుందో ఈ సినిమా విడుదల అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: