ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం సలార్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలోనే ఈ సినిమాను వేసవి సెలవు సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందం గతంలోని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో కృష్ణంరాజు మరణించడంతో సినిమాలకు బ్రేక్ చెప్పిన ప్రభాస్.. ఆ తర్వాత మళ్లీ తన షూటింగ్లను పునః ప్రారంభించాడు.

అయితే ఇప్పుడు మొన్నటి వరకు ఆహా నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ కి హాజరవుగా ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేసి అభిమానులలో మంచి క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈరోజు నుంచి ప్రభాస్ సలార్ సెట్స్ లో పాల్గొనబోతున్నాడు ప్రభాస్. ఇంకా రెండు షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు నుంచి ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొంటూ త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని.. వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.


సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మారుతి సినిమాతో పాటు ప్రాజెక్టు కే,  ఆది పురుష్ సినిమా షూటింగ్లలో కూడా పాల్గొనబోతున్నారు. ఆది పురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపబోతున్న విషయం తెలిసిందే. ఎలాగో జనవరి ఒకటవ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ఓపెన్ చేయబోతున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో సినిమా విడుదల చేస్తే.. కలిసి వస్తుందని ఆలోచించిన నిర్మాతలు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని డేట్ లాక్ చేసుకున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: