తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల ద్వారానే కాకుండా ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఎప్పుడు ముందుండే ఈయన భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. అభిమానుల ప్రేమానురాగాలు చూసి రాజకీయాలలోకి కూడా వచ్చి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి.. అధికారంలోకి రావాలని ఎన్నో కలలు కన్నాడు . కానీ అది నెరవేరలేదు. దాంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొద్దిరోజులు పనిచేసి.. ఆ తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు.


ఖైదీ నెంబర్ 150 సినిమాతో వచ్చిన ఈయన ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  అయితే గత ఏడాది వచ్చిన ఆచార్య సినిమా పూర్తిస్థాయిలో బెడిసి కొట్టడంతో ఆ తర్వాత మళ్లీ గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా విజయం సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఇకపోతే సినిమా విడుదల విషయంలో చిరంజీవి చింతిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తునివు సినిమా జనవరి 11వ తేదీన రిలీజ్ కాబోతోంది. జనవరి 12న విజయ్ వారిసు ను తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు.  అదేరోజు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే జనవరి 11వ తేదీన అజిత్ నటించిన తునివు చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరిట కేవలం కొన్ని థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు . అయితే అదే రోజులు మిస్ చేసుకున్నందుకు చిరంజీవి చింతిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే చిరంజీవి సినిమా ఒకరోజు ముందే విడుదలయితే మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ విషయంపై విడుదల తేదీని ముందుకు తీసుకొస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: