శాకుంతలం సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ను అయితే దక్కించుకుంటుంది. అయితే ఇక్కడ ఒక సంగతి బాగా వైరల్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సమంత కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. సోషల్ మీడియా లో సమంత కి వ్యతిరేఖం గా ఒక వర్గం, సపోర్ట్ గా ఒక వర్గం ఎప్పటి నుంచో అయితే ఉంది. ఈ ఎమోషనల్ వీడియో బయటకు రాగానే ఆమె ఒక మహా నటి అని, సినిమా ప్రమోషన్ కోసం బాగానే ఏడుస్తుంది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్న వారు చాలానే ఉన్నారు.

ఇక సమంత ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల అలా కొంచం ఏడ్చి ఉండవచ్చు అని కూడా మరికొంత మంది స్పందిస్తున్నారు. అయితే ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టి బాబు మాత్రం సమంత పై విరుచుకపడ్డారట.ఎవరి కోసం సమంత ఏడుస్తుంది, ఆమె ఏమైనా సంఘ సేవ చేసి కష్టాలు అనుభవిస్తుందా ? డబ్బులు తీసుకొని సినిమా చేసింది అంతేగా . సినిమా ను ప్రమోట్ చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ, ఇలా ఏడ్చి లేని పోనీ బిల్డప్పులు ఎందుకు ఇవ్వడం అంటూ చిట్టి బాబు ఆమెను ప్రశ్నించారు.

సమంత ఇలా చేయడం ఆమెకు అస్సలు కొత్తేమి కాదు, యశోద సినిమా ప్రమోషన్ కోసం తనకు ఒక వ్యాధి ఉందని బయట పెట్టి సోషల్ మీడియా ను ఆమె షేక్ చేసింది. పైగా తాను వ్యాధి తో బాధ పడుతూ డబ్బింగ్ చెప్తున్నా అంటూ జనాల సానుభూతి కోసం ప్రయత్నిస్తుంది అంటూ కూడా వ్యాఖ్యానించారు.సమంతకు వచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనది ఏమి కాదు ఇప్పటి వరకు చాల మందికి వచ్చిందే. కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఇలా చీప్ పబ్లిసిటీ చేయడం పట్ల జనాలు నవ్వుతున్నారు అంటూ చిట్టి బాబు చెప్పుకొచ్చారు.. ట్రైలర్ ఈవెంట్ లో స్టేజి పైన అంతలా బాగా లేనట్టు ఆమె ప్రవర్తించడం సబబు కాదు. ఒక వేళా ఆమె ఆరోగ్యం బాగోలేకపోతే ఈవెంట్ కి రాకుండా సినిమా విడుదలకి ప్రమోషన్ కి వచ్చి ఉంటె బాగుండు కదా అన్నారట చిట్టి బాబు. ఇక చిట్టి బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మిడిల్ లో బాగా వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: