ఇకపోతే గత కొద్ది రోజులుగా ఈ సినిమాను థియేటర్లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో అందరి చూపులకు నిద్ర లేపుతూ సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ ధమాకా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ రైట్స్ కోసం భారీ ధరను చెల్లించింది అని కూడా సమాచారం . ఈ సినిమా జనవరి 22 నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం త్వరలోనే వెల్లడించబోతోంది. ఇక ధమాకా సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలయ్యింది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో బెజవాడ ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరించారు. ఇకపోతే రవితేజకు క్రాక్ సినిమా తర్వాత మరే సినిమా కూడా విజయాన్ని అందించలేదు. అలా వచ్చిన ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఘోర పరాభవాన్ని చూపించాయి. అయితే ధమాకా సినిమా మాత్రం మంచి కమర్షియల్ విజయాన్ని అందించింది అని చెప్పవచ్చు.