సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వస్తూ ఉండడం మనం చూస్తుంటాం. అయితే తాజాగా గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా శృతిహాసన్ ఆరోగ్యానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా శృతిహాసన్ మానసిక సమస్యతో బాధపడుతుంది అని.. దానికి గాను చికిత్సను కూడా శృతిహాసన్ తీసుకుంటుంది అని రకరకాల వార్తలు రావడం జరిగింది. అయితే తాజాగా తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకి గాను స్పందించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. 

ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ తాను ఎలాంటి మానసిక సమస్యతో ఇబ్బంది పడడం లేదు అని తనకి కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే వస్తుంది అని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇక ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్య పరిస్థితి గురించి రకరకాల వెబ్సైట్లో వచ్చిన తప్పుడు కథనాలకు చెందిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది శృతిహాసన్.ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి తప్పుడు సమాచారం అలాంటి విషయాలపై నాటకీయతా లేదా తమ ఆరోగ్య సమస్యలను బయట పెట్టడానికి భయపడుతూ ఉంటారు.. కానీ నా విషయంలో అలా జరగలేదు..

నేను ఎల్లప్పుడూ మానసికంగా ఆరోగ్యంగా చాలా బాగున్నాను.. ప్రతి దాంట్లోనూ నేను జాగ్రత్త వహిస్తాను నాకు ప్రస్తుతం వైరల్ ఫీవర్ మాత్రమే ఉంది.. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు గాని ఏదైనా మానసిక సమస్య ఉంటే కనుక మీరు వైద్య నిపుణులను సంప్రదించండి. నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి నమ్మండి అంటూ తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకి ధనుష్ స్పందించింది శృతిహాసన్.తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా నటించిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. నందమూరి బాలకృష్ణ సరసన వీర సింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి, సరసన వాల్తేరు వీరయ్య సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: