తెలుగు బులితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ విష్ణు ప్రియ. ముఖ్యంగా సుదీర్ తో కలిసి చేసినటువంటి పోవే పోరా షో తో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ డాన్సులతో తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ.తాజాగా జబర్దస్త్ లో కమెడియన్ రీతూ చౌదరి తో కలిసి విష్ణు ప్రియ వెకేషన్ కు వెళ్లినట్లుగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అలాగే వీరిద్దరూ కలిసి ఒక సాంగ్ వీడియోని షేర్ చేయడం జరిగింది. విష్ణు ప్రియ వీడియో చూసిన అభిమానుల సైతం తెగ లైక్స్ కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో విష్ణు ప్రియ బోల్డ్ ఫోటోషూట్లతో తెగ వైరల్ గా మారుతూ ఉండేది. అయితే ఈ మధ్య మాత్రం పెద్దగా ఫోటోషూట్లు ఏవి చేయలేదు. ముఖ్యంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎవరో న్యూడ్ ఫోటోలు షేర్ చేయడంతో ఆ విషయం వైరల్ గా మారింది.ఇక అప్పుడు నుంచి విష్ణుప్రియ సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటోంది. చివరిగా విష్ణు ప్రియ సుధీర్ తో కలిసి వాంటెడ్ పండుగాడు సినిమాలో నటించింది. ఈ సినిమాలో విష్ణు ప్రియ గ్లామర్ రోల్ పాత్రలో కనిపించింది. నటిగా అడపా దడపా సినిమాలలో ఆఫర్లు వస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోతోంది. విష్ణు ప్రియ యాంకర్ గా తన కెరియర్ లో బాగానే జరిగింది అని చెప్పుకోవచ్చు మొదట ఆమె ప్రస్థానం యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి బాగా ఫేమస్ అయ్యింది విష్ణు ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి: