చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్న విజయ్.. తెలుగు వారసుడు సినిమా కోసం ఎందుకు తెలుగులో ప్రచారం చేయలేదు అనే వార్తలు కూడా ఇప్పుడు గుప్పుమంటున్నాయి. నిజానికి తెలుగులో సినిమాను ప్రమోట్ చేయడం అతనికి ఇష్టం లేదా? మరి ఏదైనా కారణమా? అన్న కోణాలలో కూడా అభిమానులు పరిశీలిస్తున్నారు. ఇకపోతే హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ దళపతి తప్పించుకున్నాడు. కేవలం దిల్ రాజు, రష్మిక మందన మాత్రమే హాజరయ్యారు. అంతేకాదు ఇప్పటివరకు జరిగిన ఏ ప్రెస్ మీట్ లో కూడా విజయ్ కనిపించకపోవడం పలు సంచలనాలకు దారితీస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ హీరో శ్రీకాంత్, సీనియర్ నటి జయసుధ కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శరత్ కుమార్ మరియు శ్యామ్ లకు హైదరాబాదుకు వచ్చి ఓపెనింగ్ షోలకు హాజరైనందుకు శ్రీకాంత్ అలాగే జయసుధ వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీన్నిబట్టి చూస్తే శ్రీకాంత్, జయసుధ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే పోషించారు. కానీ సినిమాను గెలిపించుకోవడం కోసం వారు ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. మరి విజయ్ ఎందుకు తన సినిమాను ప్రమోట్ చేయడానికి రాలేదు అన్న విషయం మాత్రం ఇప్పటికే సందేహం గానే మిగిలిపోయింది.