మరొకవైపు నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా కూడా మార్చి 30వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం ,హిందీ, కన్నడ , భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఒకవేళ ఈ సినిమా మంచి విజయం సాధిస్తే కనుక కీర్తి సురేష్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయినట్టే.. ఇదివరకే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ పాత్ర పోషించి అందరిని అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరొక గోల్డెన్ ఛాన్స్ అందుకుందని సమాచారం.
రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం జైలర్ . ఇందులో కీర్తి సురేష్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ప్రియాంక అరుల్ మోహన్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో రజనీకాంత్, కీర్తి సురేష్, ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు శివరాజ్ కుమార్ , వసంత్ రవి , రమ్యకృష్ణ, వినాయకన్, యోగి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.