మరోపక్క త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ మహేష్ బాబుకు అంతగా నచ్చలేదు. కాబట్టి మార్చి సరికొత్తగా రాయమని చెప్పారట. దాంతో త్రివిక్రమ్ కూడా ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. నిజానికి గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన సినిమా షూటింగ్ మొదలవుతుందని ప్రకటించినప్పటికీ.. మహేష్ బాబు విదేశాలకు వెళ్లిపోవడంతో కుదరలేదు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చినప్పుడైనా సినిమా షూటింగ్ మొదలు పెడతాము అంటే అది కూడా జరగలేదు. కానీ ఇప్పుడేమో ఏకంగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసి అభిమానులకు శుభవార్త అందిస్తున్నారు మేకర్స్.
మహేష్ బాబు హీరోగా , పూజాహెగ్డే హీరోయిన్గా తెరకెక్కుతున్న సినిమాకు ఎస్ఎస్ఎంబి 28 అనే తాత్కాలిక పేరును పెట్టారు. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు.. ఇందులో శ్రీ లీలా రెండవ హీరోయిన్గా నటించబోతున్నట్లు స్పష్టం చేశారు. మహేష్ బాబు సినిమాలో గతంలో నటించడం కుదరదు అని చెప్పిన శ్రీ లీలా.. ఇప్పుడు అందులో అవకాశాన్ని దక్కించుకొని.. మరింత ఉన్నత స్థానానికి చేరుకోబోతోంది అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు సినిమా అప్డేట్ గురించి తెలిసి ఆయన అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సినిమా నుండి మహేష్ బాబు లుక్ నైనా రివీల్ చేయండి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ మేరకు త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.