ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ .18 కోట్ల రూపాయల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఈ సినిమా రూ .20 కోట్లకు పైగా వసూలు రాబడినట్లు సమాచారం. ఇక ఇప్పటిదాకా ఈ సినిమా థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే ..అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటి లో స్ట్రిమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది అన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఓకే రోజు రెండు ఓటీటి లలో విడుదలయ్యి అవకాశం ఉన్నది.
అయితే ఈ సినిమా మూవీ ఓటిటి రైట్స్ ను అహ సంస్థ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరొక ఓటీటి దిగ్గజ సంస్థ.. నెట్ ఫ్లెక్స్ ఈ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఓటీటి లలో ఈనెల 27వ తేదీ నుంచి స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపైన అధికారికంగా ప్రకటన కూడా వెదబడింది ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు నిర్మించారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు తెరకెక్కించాలని చూస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో స్పై అనే ఒక సినిమా మాత్రమే ఉన్నది.