ముందు గాడ్ ఫాదర్ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా వాల్తేరు వీరయ్య తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు మళ్లీ మరొక తమిళ్ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ఖైదీ నెంబర్ 150 రీమేక్ సినిమాతోనే మొదలుపెట్టాడు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ తో పాటు ఇప్పుడు చేస్తున్న భోళా శంకర్ సినిమా కూడా కావడం గమనార్హం.
ఇప్పుడు అజిత్ తమిళ్ సినిమా కథను రీమేక్ చేయాలని మెగాస్టార్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే అజిత్ తమిళంలో నటించి భారీ సక్సెస్ అందుకున్న విశ్వాసం సినిమాను రీమేక్ చేయాలని చిరంజీవి ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ను ఫిక్స్ చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. గతంలో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలను తెరపైకి తీసుకొచ్చిన వివి వినాయక్ ఇప్పుడు మళ్లీ చిరంజీవితో మరొక కథను సెట్ చేయడం విశేషం. గత కొంతకాలంగా వివి వినాయక్ సరైన హిట్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో చిరంజీవి సినిమాతో వివి వినాయక్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.