ఈ సినిమాకి త్రినాధరావు దర్శకత్వం వహించగా బెజవాడ ప్రసన్నకుమార్ కథను అందించారు.తమన్ సంగీతాన్ని అందించారు. దాదాపుగా పాటలన్నీ కూడా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకు ప్లస్సుగా మారింది ఈ సినిమా రూ .40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే దాదాపుగా రూ .20 కోట్ల రూపాయల వరకు ఫ్రీ రిలీజ్ జరుపుకుంది. ఈ సందర్భంగా టోటల్గా ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందని విషయానికి వస్తే... 28 రోజులలో ఈ సినిమా నైజాంలో రూ.19 కోట్ల రూపాయలు రాబట్టింది..
ఇక అలాగే సీడేడ్ లో రూ.8 కోట్ల రూపాయలు.. గుంటూరులో రూ.1.91 కోట్ల రూపాయలు.. కృష్ణాలో రూ.1.85 కోట్ల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1.3 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో రూ.1.35 కోట్ల రూపాయలు సాధించింది అలాగే ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే రూ.40.70 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.. అలాగే మిగతా ప్రాంతాలలో కూడా ఈ సినిమా రూ.3.75 కోట్ల రూపాయలు రాబట్టినట్లు తెలుస్తోంది అలాగే ఓవర్సీస్ లో రూ.3 మూడు కోట్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు రూ .25 కోట్ల రూపాయలు లాభాన్ని మిగిల్చింది.