
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా నటించడానికి వీరి స్నేహబంధం మరింత సహకరించింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈమూవీలో వీరిద్దరూ కలిసి నటించిన ‘నాటు నాటు’ పాటకు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో వీరిద్దరి స్నేహబంధం మరింత బలపడింది.
ఈమధ్య రాజమౌళితో కలిసి వీరిద్దరూ అమెరికా వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ చరణ్ లు తమ మధ్య కొనసాగుతున్న స్నేహ బంధం పై స్పందించారు. మూడేళ్లనుంచి తమ మధ్య ఉన్న పోటీని శతృత్వం అన్న పదంతో కొందరు వార్తలు వ్రాస్తున్నారని అలాంటి వార్తలు విని తమకు బోర్ కొట్టి తాము స్నేహాన్ని ఎంచుకున్నాము అంటూ చరణ్ కామెంట్ చేసాడు.
అయితే ఈవిషయమై జూనియర్ వేరే విధంగా స్పందిస్తూ తమ మధ్య ఉన్న స్నేహానికి ఫిజిక్స్ తో సంబంధం ఉంది అంటున్నారు. భిన్న ధృవాలు ఆకర్షించుకున్నట్టుగా తామిద్దరం ఒకరికొకరు ఆకర్షితులు అయ్యామని టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ సెషన్ లో ఆ బంధం బలపడింది అంటున్నాడు. “చరణ్ తనలో లేనివాటికోసం నాతో కలిశాడు, నాకు ఏం కావాలనుకుంటున్నానో అది చరణ్ నుంచి నేను పొందాను” అంటూ జూనియర్ వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడు. శతృత్వం లేని ప్రేమ తమ మధ్య ఉంది అంటూ జూనియర్ చరణ్ లు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..