ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు పుష్పం మేనరిజం, దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ సినిమాను మరింత పాపులర్ అయ్యేలా చేశాయి. ఎంతలా అంటే విదేశాలలో ఉండే ప్రముఖ మేయర్లు కూడా తగ్గేదేలే అనే సిగ్నేచర్ తో మరింత పాపులారిటీ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లి , అలాగే ఊ అంటావా మావా అనే పాటల్లో బన్నీ వేసిన హుక్ స్టెప్స్ అందర్నీ మరింతగా ఆకట్టుకుంటున్నాయి.
2021 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది .దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఉత్తరాదిలో ఈ మూవీకి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. కానీ వంద కోట్లు రాబట్టడంతో అక్కడ కూడా ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం ఉత్తరాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.. మొదటి భాగంలో కూలీ.. సిండికేట్ స్మగ్లర్‌గా ఎదిగిన క్రమాన్ని చూపిస్తే.. ఆ సిండికేట్ ను ఏలే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండిల్ స్మగ్లర్ గా తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నాడు అనే నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే డైరెక్టర్ రివీల్ చేశారు.
అందుకే భారీ స్థాయిలో విదేశాలలో కూడా ఈ సినిమాను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది . జపాన్, థాయిలాండ్, బ్యాంకాక్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరించబోతున్నారట. ఫస్ట్ పార్ట్ నుంచి అత్యంత భారీ బడ్జెట్ తో ఊహించని లొకేషన్ లతో భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు . ఈ క్రమంలోనే వైజాగ్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా
. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు అల్లు అర్జున్. అక్కడ పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని సమాచారం.