ఈ సినిమాను తెలుగులో తెగింపు పేరిట రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. మొదట్లో సర్కారు వారి పాట సినిమాను గుర్తుకు తెస్తోంది అనే కామెంట్లు వినిపించినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరో సునామీ సృష్టించింది అని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా తన తదుపరిచిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్.. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. అందుకు సంబంధించిన తారాగణాన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను కాదని డైరెక్టర్ మగిజ్ తిరుమేని కి తన 62వ చిత్ర భాద్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఆరు నెలల సమయం అడిగారట. అయితే అందుకు సంతృప్తి చెందని అజిత్.. డైరెక్టర్ ని మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అజిత్ 62వ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.