హీరోయిన్ రేణు దేశాయ్ తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించింది. వెండితెర పైన కనిపించక ఇప్పుడు చాలా కాలం అవుతోంది. చివరిగా తన భర్త పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో నటించింది. మళ్లీ ఆ తర్వాత ఏ చిత్రంలో కూడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ తో పెళ్లి పిల్లలతో బిజీగా తన సమయాన్ని గడిపేసింది.పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఒక సినిమాని దర్శకత్వం చేయాలని చాలా కలలు కంది.కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయింది సమాచారం.

అప్పుడు పలు టీవీ షోవులలో ,వెబ్ సిరీస్ లలో కనిపించిన రేణు దేశాయ్.. ఆమధ్య పలువు సిరీస్లలో కూడా నటిస్తోంది. అయితే అవి కరోనా వల్ల మరింత ఆలస్యంతో మధ్యలోనే అట్టకెక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం.. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్న సంగతి తెలియజేసిందే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటుంది రేణు దేశాయ్. టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సంబంధించి ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.



రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించి షూటింగ్ అయిపోయినట్లుగా తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇక ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు థాంక్స్ తెలియజేస్తోంది అభిషేక అగర్వాల్ వారివల్లే ఈ యూనిట్ అంతా కూడా తనకు ఫ్యామిలీలో మారిపోయింది అని తన ఇంస్టాగ్రామ్ ద్వారా రాసుకొచ్చింది. తన పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా జరిగే ప్రతిక్షణాన్ని కూడా తాను బాగా ఎంజాయ్ చేసినట్లుగా తెలియజేస్తోంది. ప్రస్తుతం రేణు దేశాయ్ అభిమానులతో పంచుకున్న ఈ పోస్టులు ఎక్కడ కూడా రవితేజ పేరును తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. ఈ సినిమాతో మరికొన్ని అవకాశాలు రేణు దేశాయ్ అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: