మరీ ముఖ్యంగా ఆయన చివరి కోరిక తీరకుండానే మరణించారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.. 1965లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆత్మగౌరవం అనే సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన విశ్వనాథ్ ఆ తర్వాత శంకరాభరణం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ , శృతిలయలు, సాగర సంగమం, సూత్రధారులు , స్వర్ణకమలం, స్వయంకృషి, స్వాతికిరణం ఇలా ఎన్నో మరుపురాని అద్భుతమైన చిత్రాలను తెలుగుతెరకు అందించారు.
ఒక దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా చెరగని ముద్ర వేసుకున్న విశ్వనాథ్ దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు సేవలు అందించారు. అయితే ఆయనకు ఒక తీరని కల ఉండిపోయిందట..అదేమిటంటే తన సినీ కెరియర్ లో ఎక్కువగా సాంఘిక సినిమాలే చేశారట పౌరాణిక సినిమాలు ఆయన చేయలేదు అని ఈ జోనర్ పై పెద్దగా అవగాహన లేకపోవడం వల్లే ఆయన అటువైపు ప్రయత్నం చేయలేదని సమాచారం. ఎప్పటికైనా అన్నమయ్య సినిమా చేయాలని ఎన్నో కలలు కన్నారట. చాలా సంవత్సరాల పాటు ఆ కథపై పరిశోధన కూడా చేశారట. కానీ అదే కథతోనే మరో దర్శకుడు సినిమా చేస్తున్నారని తెలిసి విశ్వనాథ్ తన ప్రయాణాన్ని మానుకున్నారని సమాచారం . అలా తన కల నెరవేరకపోవడం ఆయనకు ఎప్పటికీ తీరని కలలాగే మిగిలిపోయింది. ఏది ఏమైనా ఒక అద్భుతాన్ని ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పవచ్చు..