శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషి వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన ఈయన నిన్న అనగా ఫిబ్రవరి 2 గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే కే విశ్వనాథ్ మరణించే ముందు కొన్ని గంటల వ్యవధి లో ఆయన ఇంట్లో ఏం జరిగింది అనే విషయం తెలిస్తే మాత్రం నిజంగా కన్నీళ్ళాగవు. చనిపోయే చివరి నిమిషం వరకు ఇండస్ట్రీ కోసమే పని చేసిన ఆయన చివరి దశలో కూడా తన మనసులో భావాలను వ్యక్తపరుస్తూ ఒక పాట రూపంలో రాయడం మొదలుపెట్టారట . అయితే వయోభారం కారణంగా చేతులు సహకరించకపోయేసరికి పెద్ద కొడుకును పిలిపించి తన మాటలతో పాటను రాయమని సూచించారట.
కళాతపస్వి మాటల రూపంలో చెబితే ఆయన పెద్ద కొడుకు వాటిని అక్షర రూపం ఇచ్చారు. ఆ తర్వాత కొడుకు చేత పాడించి.. ఆ పాటలు వింటూ అలా కుర్చీలో ఒక్కసారిగా వాలిపోయారట. కుటుంబ సభ్యులు ఏమైందని..హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు అని వైద్యులు చెప్పడం తో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఆయన 92 సంవత్సరాల వయసులో కూడా అందులోనూ చివరి దశలో సినిమా పరిశ్రమ గురించే ఆలోచించారంటే ఆయనకు ఇండస్ట్రీపై ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.