శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా ఈ ట్రైలర్ లో మూడు డిఫరెంట్ గెటప్లలో కళ్యాణ్ రామ్ చక్కటి వేరియేషన్ చూపించారు . ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా.. విలన్ గా, కూల్ గా 3 షేడ్స్ లతో కూడిన క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం . హీరోయిన్గా ఆషికా రంగనాథ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే ముఖ్యంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. బింబిసారా సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా బింబిసార కమర్షియల్ సక్సెస్ గా నిలవడంతో అమిగోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినట్లు సమాచారం. రిలీజ్ కి ముందే ఈ సినిమా ఇప్పుడు లాభాల బాట పట్టినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఈ సినిమా తర్వాత ఆయన డెవిల్ పేరుతో ఇంకొక సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.