త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ ఆమెతో అతడు చేసిన సినిమాలు రెండు సూపర్ హిట్ కావడంతో మహేష్ తో లేటెస్ట్ గా త్రివిక్రమ్ తీస్తున్న మూవీకి కూడ త్రివిక్రమ్ పట్టుపట్టి పూజా హెగ్డే ను ఎంపిక చేసుకున్నాడు. వాస్తవానికి ప్రస్తుతం పూజా కెరియర్ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. క్రితం సంవత్సరం ఆమె నటించిన ‘రాథే శ్యామ్’ ‘ఆచార్య’ ‘బీస్ట్’ ‘సర్కస్’ మూవీలు అన్నీ వరసగా ఫెయిల్ అవ్వడంతో ఆమె షాక్ అయింది అని అంటారు.
ప్రస్తుతం ఈమె మహేష్ తో ఒక సినిమాను అదేవిధంగా సల్మాన్ ఖాన్ తో కలిసి ఆమె నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలు తప్ప మరే సినిమాను ఆమె చేయడంలేదు. వాస్తవానికి పూజ హెగ్డే డేట్స్ గురించి కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె కనీసం కథలు వినడానికి కూడ ఆశక్తి కనపరచడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో పూజ ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తోంది అంటూ కొందరు ఆశ్చర్యపడుతున్నట్లు టాక్.
ఈవిషయమై ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం పూజ సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల వెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు ఉన్నాయి అంటూ కొందరు గాసిప్ప్ ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. త్రివిక్రమ్ కు జాతకాల పై అదేవిధంగా పూజల పై చాల నమ్మకం. దీనికితోడు త్రివిక్రమ్ కు సన్నిహితుడైన ఒక సిద్ధాంతి చెప్పే విషయాలను త్రివిక్రమ్ పూర్తిగా అనుసరిస్తాడు అని కూడ అంటారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడం ఆతరువాత పవన్ బయట కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు పవన్ చేతికి పెట్టుకునే పెద్ద పగడం ఉంగరం విషయంలో కూడ త్రివిక్రమ్ సలహాలు ఉన్నాయి అని అంటారు. ప్రస్తుతం పూజా హెగ్డే కు వరస ఫెయిల్యూర్స్ రావడంతో రాబోతున్న మే నెల పూర్తి అయ్యేవరకు పూజా హెగ్డే ను మరో కొత్త సినిమా ఏదీ ఒప్పుకోవద్దని జూన్ నుండి ఆమె జాతకంలో మార్పులు వస్తాయి కాబట్టి ఆతరువాత కొత్త సినిమాల ఎగ్రిమెంట్ పై సంతకాలు పెట్టమని త్రివిక్రమ్ ఆమెకు సలహా ఇచ్చాడు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది..