విజయ బాపినీడు దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణ సారథ్యంలో 1991 మే 9 వ తేదీన విడుదలైన గ్యాంగ్ లీడర్ చిత్రం భారీ సక్సెస్ అందుకుంది. ఇందులో హీరోగా చిరంజీవి, హీరోయిన్గా విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిరంజీవి మాస్ ఇమేజ్ను మరింత పదిలం చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాను ఫిబ్రవరిలోనే మహాశివరాత్రి సందర్భంగా కానీ ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో తెరవబడిన పరిమిత షోలకు పేలవమైన బుకింగ్లు.. పేలవమైన ప్రతిస్పందనను పరిగణలోకి తీసుకొని సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం సమంత శాకుంతలం తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సార్ సినిమాలు కూడా ఒకటి తర్వాత ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో థియేటర్ లు కూడా దొరికే అవకాశం ఉందో లేదో అనేది అనుమానంగా మారింది. ఈ క్రమంలోని ఈ సినిమాను కొంతకాలం రీ రిలీజ్ ను వాయిదా వేస్తూ చిన్న సినిమాలు ఉన్నప్పుడు మళ్ళీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.