తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా అటు రాజకీయాలలో ఇటు సిని పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక నందమూరి రామకృష్ణ ఇటీవలే బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్న అని కూడా పరామర్శించడం జరిగింది. తారకరత్న కూడా గుండెపోటుతో హాస్పిటల్లోకి చేరడం జరిగింది. అయితే అనంతరం వైద్యం కోసం ఇతర దేశాలకు తీసుకువెళ్లినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.


అంతలోనే నందమూరి తారక రామారావ్ కుమారుడు నందమూరి రామకృష్ణ నిన్నటి రోజున తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో పయనిస్తున్న సమయంలో ఒక కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే రామకృష్ణకు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం. కానీ కారు మాత్రం నుజ్జునుజు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అటు నందమూరి అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులకు సైతం ఈ విషయం విని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి ఇలాంటి ఇబ్బందులు నందమూరి కుటుంబం ఎదుర్కొంటోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు నేటిజన్స్.


అలాగే గతంలో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పుపై కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది. తన తండ్రి ఈ యూనివర్సిటీకి మూల వ్యవస్థాపకుడు కారకుడు అంటూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎంతోమంది రాజకీయ పార్టీలు కూడా తమ తండ్రి పార్టీకి మద్దతు తెలిపాయని తెలియజేయడం జరిగింది. ఇలా నందమూరి కుటుంబానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా స్పందించారు రామకృష్ణ. ఇలా రోడ్డు ప్రమాదానికి గురవడంతో అభిమానుల సైతం కాస్త ఆందోళన చెందుతున్నారు. మరి రామకృష్ణ ఆరోగ్యం పైన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: