ఇకపోతే ప్రస్తుతం శకుంతలగా బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ సమంత, మహారాజుగా దేవ్ మోహన్ నటిస్తున్న పౌరాణిక ప్రేమ కథ చిత్రం ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ లాక్ చేశారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి చక్కటి సంగీతాన్ని అందించారు.
విజువల్ వండర్ గా 3D టెక్నాలజీతో తెలుగు, తమిళ్, హిందీ , మలయాళం, కన్నడ భాషల్లో శాకుంతలం సినిమా విడుదల అవుతూ ఉండగా సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి . అందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అలాగే మల్లికా పాట అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, గౌతమి , మధుబాల, మోహన్ బాబు , అదితీబాలన్, అనన్య నాగళ్ళ , జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా ఈసారైనా విడుదల అవుతుందో లేదో అని అనుమానం కూడా కలుగుతోంది.