యాక్షన్ సినిమాల్లో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్'కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సూపర్ యాక్షన్ సీన్స్ తీయడంలో ఈ సినిమా టీం ఖచ్చితంగా 100 శాతం సక్సెస్ అవుతుంది.ఇప్పుడు ఈ సిరీస్ లో వస్తున్న పదో భాగం విడుదలకు సిద్ధం అయింది. దీని ట్రైలర్ను నిర్మాతలు విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంటుంది.ఎప్పటిలానే ఈ ట్రైలర్ లో కూడా కార్లు గాల్లోకి లేచిపోవడం, ఒక కారుతో రెండు హెలికాఫ్టర్లను లాగి పారేయడం లాంటి సూపర్ స్టంట్స్ స్టంట్స్ను తీయడానికి ప్రయత్నించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఆరు భాగాల వరకు ఫ్రెష్ విలన్స్ను సినిమాలోకి తీసుకు వచ్చేవారు. కానీ ఏడో భాగంలో మాత్రం జాసన్ స్టాటమ్ రివెంజ్ ఫార్ములా సక్సెస్ కావడంతో అక్కడి నుంచి ప్రతి పార్ట్ ని అదే ఫార్మాట్లో తీస్తున్నారు. అయితే ఇది ఫ్యాన్స్కు ఇది అంతగా నచ్చలేదు. అయినా పదో భాగం కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు.


ఈ చిత్రంలో విలన్గా ఆక్వామ్యాన్ ఫేమ్ జేసన్ మోమోవా కనిపించనున్నాడు. అలాగే కెప్టెన్ మార్వెల్ పాత్రలో కనిపించిన బ్రీ లార్సెన్ కూడా ఇందులో భాగం కావడం జరిగింది. ఇక ఏడో భాగం షూటింగ్ తర్వాత యాక్సిడెంట్ వల్ల చనిపోయిన పాల్ వాకర్ను కూడా ఈ సినిమాలో చూపించారు.విన్ డీజిల్, మిషెల్ రోడ్రిగ్జ్, టైరీస్ గిబ్సన్, క్రిస్ బ్రిడ్జెస్, జేసన్ మోమోవా, నథానీ ఇమ్మాన్యుయెల్ ఇంకా అలాగే జోర్డానా బ్రూస్టర్, జాన్ సేనా, జాసన్ స్టాటమ్, సుంగ్ కాంగ్, అలన్ రిచ్సన్, డేనియలా మెల్కోయిర్, స్కాట్ ఈస్ట్వుడ్, హెలెన్ మిర్రెన్, చార్లీజ్ థెరాన్, బ్రీ లార్సెన్ ఇంకా అలాగే గాల్ గాడోట్ ఈ భాగంలో నటించనున్నారు.ఈ సినిమాని మే 19వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక ఇంకో భాగంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ను ముగించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: