ఎప్పుడూ కూడా ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు కళ్యాణ్ రామ్. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. గత ఏడాది బింబిసారా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ఆమిగొస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.


ఇందులో కళ్యాణ్ రామ్ ఒక పాత్రలో రియల్ ఎస్టేట్ బిజినెస్ గా కనిపిస్తారు.. అలాంటి సమయంలోనే మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని ఒక వెబ్సైటు ద్వారా తెలుసుకుంటారు.. తన లాగే ఉండే వాళ్ల గురించి తెలుసుకోవాలని ఆత్రుత పడుతూ ఉంటారు.. ఇక తర్వాత కళ్యాణ్ రామ్ తన పోలిన మనసులను తెలుసుకొని ఏం చేస్తారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇందులో మరొక పాత్రలో సాఫ్ట్వేర్ గా కనిపించారు కళ్యాణ్ రామ్. ఇక మరొక పాత్రలో గ్యాంగ్ స్టార్ గా కూడా కనిపించారు. ఈ సినిమా మొత్తం కళ్యాణ్ రామే వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు.

అన్ని పాత్రలో కళ్యాణ్ రామ్ చాలా చక్కగా నటించారు. కథపరంగా బాగున్నప్పటికీ రెగ్యులర్ గా రొటీన్ గా సాగడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ చిత్రంలోని ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమా టిక్కుగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో విజయ దిశలో దూసుకుపోలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు బింబిసారా కలెక్షన్లలో సగం కూడా రాబట్టలేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి కళ్యాణ్ రామ్ ఎంతవరకు ఈ సినిమాతో సక్సెస్ అవుతాను అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. కళ్యాణ్ డెవిల్ అనే సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: