ఈ మధ్యకాలంలో తమిళ్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఆదరణ పెరిగింది. ఇక్కడ కూడా మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యంగా అక్కడి స్టార్ హీరోలు ఇక్కడ సినిమాలలో డబ్ చేసి రిలీజ్ చేస్తూ మంచి టాక్ వస్తే బాగానే కలెక్షన్లను కూడా సాధిస్తున్నారు. ఇకపోతే ఇలాంటి డబ్ సినిమాలు మన టాలీవుడ్ లో మంచి విజయం సాధించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి తమిళ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఇక్కడ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిలో ధనుష్ కూడా ఒకరు.


ముఖ్యంగా ఈయనకు తెలుగులో ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన సినిమాలు చాలా వరకు ఇక్కడ బాగానే హిట్ అవుతున్నాయి.  దీంతో ప్రతి సినిమా కూడా డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు ధనుష్. ఈ క్రమంలోనే ఈసారి తెలుగులో డైరెక్ట్ గా చేసిన సినిమా సార్ .. ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు . తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.


తెలుగు,  తమిళ్ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.  ఇకపోతే ఈ సినిమాను తమిళంలో వాతి పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంపై సెటారికల్ గా ఈ సినిమా తీసినట్లు మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇకపోతే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్గా తెలుగులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయితే ఈ సినిమా తెలుగులో మరింత విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: